- మాజీ ప్రధాని వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వెలిచాల రాజేందర్ రావు
కాకతీయ, కరీంనగర్ : పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు, దేశ మహిళా శక్తికి ప్రతీక, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ పేదల పక్షపాతి అని, ఎన్నో సంక్షోభాలను సవాళ్లుగా స్వీకరించి దేశాన్ని ముందుకు నడిపిన ఉక్కు మహిళ అని అన్నారు. ఆమె చూపిన మార్గం కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ష మల్లేశం, అనంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


