కాకతీయ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరుకు చెందిన పలువురు బీజేపీ, బీఆర్ ఎస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోరం పగిడయ్య, ఆత్మకూరి ప్రవీణ్, ఆత్మకూరి రాఘవ, రాజు, గొబ్బూరి రఘుపతి, కుర్సం రాంబాబు, తునూరి జయరాజు లకు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాదరాజు, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దాట్ల సీతారామరాజు, సొసైటీ ఉపాధ్యక్షుడు వత్సవాయి జగన్నాథరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే ఖాజావలి, కాకర్లపూడి కళ్యాణ్, సుధీర్, నల్లగాసి రమేష్, కురుసం కృష్ణమూర్తి, బంధం కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


