వరంగల్ పాలిటిక్స్ లో వింత ఆచారం
మళ్ళీ వివాదంలో మంత్రి కొండా సురేఖ
ఇందిరా గాంధీకి నివాళులర్పించే కార్యక్రమంలో పాలిటిక్స్
డీసీసీ అధ్యక్షురాలు వేసిన మాలలు తొలగించిన మంత్రి అనుచరులు
విగ్రహానికి పూల మాలలు వేసే హక్కు కూడా లేదా అంటున్న స్వర్ణ వర్గం నేతలు
వరంగల్ తూర్పులో మరోసారి బయటపడిన కోల్డ్‌వార్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,జిల్లా డీసీసీ అధ్యక్షుల మధ్య ప్రజా పాలన విషయంలో కలిసికట్టుగా ఉండి ప్రజాపాలన చేయాలి. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ లో ఏ ఒక్క మంత్రి కూడా విభేదాలు లేకుండా పార్టీ నాయకులను కలుపుకొని పాలన సాగించలేకపోతున్నారు.

శుక్రవారం రోజున ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాశిబుగ్గలోని ఇందిరా గాంధీ విగ్రహానికి మొదటగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పూలమాల వేసి ఇందిరాగాంధీ కి నివాళులు అర్పించారు. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే, పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ విగ్రహానికి వేసిన పూలమాలలను మంత్రి అనుచరులు తొలగించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
స్వర్ణ వేసిన పూలమాలను తొలగిస్తున్న కొండా దంపతుల అనుచరుడు



