కాకతీయ, కరీంనగర్ : బాల్య వివాహాలు, బాలలపై జరుగుతున్న అఘాయిత్యాల పై చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. బ్యాంకు కాలనీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీటీయూ- జీకేవై) పథకం ద్వారా నడుస్తున్న వోక్సి టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు సుందరగిరి సాయికిరణ్ గౌడ్, ప్రియాంక మాట్లాడుతూ బాల్యవివాహాలు, వేధింపులు గమనించినప్పుడు 1098 కి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. హెల్ప్ లైన్ సేవలు ఉచితంగా, రహస్యంగా అందుబాటులో ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ మమత, శిక్షకులు జక్కుల రాజు, స్పందన, శ్రీనివాస్, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
బాల్యవివాహాలు, అఘాయిత్యాలపై 1098కి ఫోన్ చేయండి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


