కాకతీయ, లక్షెట్టిపేట : పట్టణంలోని పలు స్వీట్ హౌస్ లు,బేకరీలు,చైనీస్ ఫుడ్ సెంటర్లు,హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి.ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న,అలాంటి వాటి వైపు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఉంది.కలుషిత ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది,కాలం చెల్లిన తినుబండారాలు,స్వీట్లు,బేకరీ పదార్థాలు తిని చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల, విరేచనాలు,వాంతులు, గ్యాస్టిక్,ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు.సాయంత్రం 5 దాటిందంటే బేకరీలు,హెటళ్ల తిండి కోసం జనం క్యూ కడు తున్నారు.బయటి పదార్దాలు కొనే ముందు ఎక్కువ కాలం చెల్లిన తేదీ వివరాలు చూసుకోకుండా పోవడం ఎక్కువ నష్టం కలిగిస్తోంది.

నాసిరకం వంట నూనెలు పలు హెూటళ్లు,స్వీట్స్ స్టాల్స్, పాస్ట్ ఫుడ్ సెంటర్లు,ఇతర తినుబండారాల షాపుల్లో యదేచ్చగా నాసిరకం నూనెలను వినియోగించడమే కాక వాడిన నూనెలను పలుమార్లు మరిగించి నిబంధనలను పక్కన పెడుతున్నారు.ఒకసారి వాడిన వంట నూనెను మూడుసార్లకంటే ఎక్కువగా వాడకూ డదు.ఎక్కువ సార్లు నూనెను మరిగిస్తే అందులోని భౌతిక,రసాయన లక్షణాల్లో మార్పు వస్తుంది.నూనె నాణ్యతలో టిపిసి శాతం లోపిస్తే అనేక అనర్దాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.టిపిసి 20 శాతం మించితే బిపి పెరిగి గుండె,కాలేయం వ్యాధులు ఉత్పన్నం అవుతాయని చెబుతు న్నారు.రంగులు, రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగించే టేస్టింగ్ సాల్ట్,వంటి ప్రమాదకరమైన రసా యనాలను అందరూ తినే ఆహార పదార్థాల్లో వాడుతున్నా వినియోగ దారులు అవేమీ పట్టించుకోవడం లేదు.
నిల్వ ఉంచిన పదార్థాల విక్రయాలు పట్టణంలోని పలు హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి.అనుమతి లేకుండానే నిర్వహిస్తున్న దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి.తోపుడు బండ్లకైతే లెక్కే లేదు. ఆహార పదార్థాలు ముఖ్యంగా మాంసాహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడానికి రకర కాల రంగులు వినియోగిస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు సమూనాలు సేకరిస్తున్న ప్రతిచోటా ఇవి హానికరమే అంటూ ల్యాబ్ రిపోర్టులు చెప్తున్నా యథేచ్చగా వినియోగిస్తున్నారు.హో టళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల ను సైతం మాంసాహార ప్రియులకు అంటగడుతున్నారు.బేకరీల్లో తయారు చేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్పలేని పరిస్థితి.ప్యాకేజ్ వస్తువులు ఎప్పుడు తయారు చేశారు. వాటి కాలం ఎప్పుడు తీరుతుందనే వివరాలు కూడా చాలా వరకు ఉండటం లేదు. ప్యాకేజీ యాక్ట్ ప్రకారం విక్రయించే ఆహార పదార్థాలన్నింటిపై తగిన వివరాలు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు.


