- తక్కువటైంలోనే ఎక్కువ కార్యక్రమాలు చేశారు
- విజయరాజు, సునీల్‌ను గెలిపించండి
- కామవరపుకోటలా స్టేట్ అంతా పార్టీ కార్యక్రమాలు ఉండాలి
కాకతీయ, ఏలూరు బ్యూరో: “ రాయంకుల బాగా కష్టపడుతున్నావ్.. విజయరాజు అన్న నీ మీద ఉంచిన నమ్మకాన్ని తక్కువ టైంలో బాగా నిలబెట్టావ్… ఇలాగే కష్టపడాలి… వచ్చే ఎన్నికల్లో విజయరాజు అన్నను చింతలపూడి ఎమ్మెల్యేగా… సునీల్‌ను ఏలూరు ఎంపీగా గెలిపించుకుండని ” మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణను అభినందించారు. గురువారం రాయంకుల తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే రాయంకుల పార్టీ అధినేతను తరచూ కలుస్తూ.. మండలంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ రాయంకుల పార్టీ కోసం పడుతోన్న కష్టంతో పాటు అంకితభావాన్ని గుర్తించి రాయంకులను ప్రశంసించారు. ఈ క్రమంలోనే జగన్‌ను కలిసిన రాయంకుల తాను మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేపట్టిన అన్ని కార్యక్రమాలతో కూడిన ఆల్బమ్‌ను జగన్‌కు చూపించారు. తక్కువ టైంలోనే ఎక్కువ కార్యక్రమాలు చేపట్టారు.
పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమం మండలంలో హైలెట్ అయ్యేలా చేశారంటూ జగన్ అభినందించారని రాయంకుల తెలిపారు. కామవరపుకోట మండలంలా స్టేట్ అంతా కార్యక్రమాలు జరగాలని కూడా జగన్ తెలిపారు. వచ్చే యేడాది ఆరంభంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలలో మండలంలో పార్టీ సానుభూతిపరులు, అభ్యర్థులు విజయం సాధించేలా అందరూ సమష్టిగా కష్టపడి పని చేయాలని కూడా జగన్ రాయంకులకు సూచించారు. రాయంకులతో పాటు జగన్‌ను కలిసిన వారిలో వైసీపీ సీనియర్ నాయకులు పాలకపాటి గాంధీ, కానూరు రామయ్య, పులపాకుల వేణు తదితరులు ఉన్నారు.


