- భయాందోళనలో కుటుంబ సభ్యులు
- ఇల్లు మంజూరు చేయాలని వేడుకోలు
కాకతీయ, ఖానాపురం : మొంథా తుఫాను ప్రభావం బుధవారం భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షాలకు ఖానాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లు నేలమట్టమైనట్టు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా ఇల్లు కూలిపోయిన వాటిని తహసీల్దారు నంగునూరి రమేష్ ఆదేశానుసారం ఆర్ఐ గాయత్రి, జీపీవో స్వప్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో చిన్నపెళ్లి ఎల్లయ్య ఇంటి గోడలు ధ్వంసం కాగా, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని బాధితుడు వాపోయారు. వర్షాలు విపరీతంగా కురిస్తే ఇల్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.


