కాకతీయ, పరకాల : పరకాల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఏకు కార్తీక్ తండ్రి ఏకు శంకర్ ఇటీవల మృతిచెందగా గురువారం వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే మండలం లోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బరిగేల రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, లింగమూర్తి, విజయపాల్ రెడ్డి, వేణురెడ్డి, సుధాటి వెంకన్న, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


