- లేకపోతే ఉద్యమాలతో రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం
- గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్
కాకతీయ, కరీంనగర్ : పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌వీ నిర్వహించిన కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. వర్షాన్ని పట్టించుకోకుండా సుమారు 2వేల మంది విద్యార్థులు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు “సీఎం దిగిపో” అని నినాదాలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తుగ్లక్ పాలన శైలిలో నడుస్తోందని, విద్యాశాఖపై సరైన సమీక్ష లేకుండా, ప్రశ్నలు స్పందించకుండా ప్రవర్తించడం ద్వారా విద్యార్థుల హక్కులను గౌరవించడంలో విఫలమవుతోందని అన్నారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే బీఆర్‌ఎస్‌వీ అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తుందని సంఘం జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, బండారపు అజయ్ కుమార్ గౌడ్, శాతవాహన విశ్వవిద్యాలయం ఇంచార్జ్ చుక్కా శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, శాతవాహన జనరల్ కార్యాలయ నేత చెన్నమళ్ల చైతన్య, ఆరే రవి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గంగాధర చందు, నారదాసు వసంత్, వడ్లకొండ పరుశురాం, రవితేజ, మున్నా, బండ వేణు యాదవ్, ధీరజ్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, ఆవుల తిరుపతి, ఒడ్నాల రాజు, ఆలేటి శ్రీరామ్, సుమంత్, ఓంకార్, మణి దీప్ నాయుడు, దినేష్, తరుణ్, రావణ్, కొమ్ము నరేష్, వొళ్లాల శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పీటీసీ వద్దకు తరలించామని కార్యకర్తలు ఆరోపించారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తోందని విద్యార్థి నేతలు ఆరోపించారు. మంత్రి, అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని విద్యార్థి నాయకులు కోరారు. ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కార్యారచణ విస్తరిస్తామని బీఆర్‌ఎస్‌వీ నేతలు స్పష్టం చేశారు.


