epaper
Saturday, November 15, 2025
epaper

జ‌డివాన‌!

  • జ‌డివాన‌!
  • నీట మునిగిన వ‌రంగ‌ల్‌
  • బుధ‌వారం ఉద‌యం 8గంట‌ల‌కు మొద‌లైన వాన‌
  • ఒక్క నిముషం గెరువు ఇవ్వ‌కుండా కుండ‌పోత‌
  • గోదారులైన జాతీయ ర‌హ‌దారులు..!
  • ఈ రాత్రి గ‌డిస్తే చాలనుకుంటున్న లోత‌ట్టు ప్రాంతాల‌వాసులు

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వాన‌లు దంచికొడుతున్నాయి.మొంథా తుఫాను ప్ర‌భావంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా బుధ‌వారం ఉద‌యం నుంచి మొద‌లైన వ‌ర్షాలు.. బుధ‌వారం రోజంతా కొన‌సాగింది. క‌నీసం ఒక్క నిముషం కూడా తెరిపివ్వ‌కుండా వాన దంచికొట్టింది. దీంతో హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణాల్లోని వంద‌లాది కాల‌నీలు నీట మునిగాయి. హ‌న్మ‌కొండ‌లోని వ‌డ్డెప‌ల్లి, టీచ‌ర్స్ కాల‌నీ, బ్యాంకు కాల‌నీ, హ‌న్మ‌కొండ చౌర‌స్తా, వికాస్‌న‌గ‌ర్‌, రెవెన్యూ కాల‌నీ, ఎక్సైజ్ కాల‌నీ, హంట‌ర్ రోడ్డు, న్యూశాయంపేట‌, డ‌బ్బాల్ ఏరియా, యాద‌వ‌న‌గ‌ర్‌, స‌మ్మ‌య్య‌న‌గ‌ర్‌, గోపాల్‌పూర్‌, భీమారం, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఉర్సుగుట్ట‌, క‌రీమాబాద్‌, శివ‌న‌గ‌ర్‌, అండ‌ర్ బ్రిడ్జీ ఏరియా, మండిబ‌జార్‌, ఎంజీఎం సెంట‌ర్‌, ములుగు రోడ్డు, కాశిబుగ్గ‌, లేబ‌ర్ కాల‌నీ, ఇలా దాదాపు త్రిన‌గ‌రి మొత్తం జ‌ల‌మ‌యం అయ్యింది.
వ‌రంగ‌ల్‌లో జ‌డివాన‌

జడివాన‌..!

 

భారీ వర్షం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాను ముంచెత్తింది. మునుపెన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలి, కోతకు గురై భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. చెరువులన్నీ నీటితో నిండి అలుగు పోస్తున్నాయి. లోతట్టు ప్రాంత కాలనీల్లోకి వరద నీరు చేరింది. బుంగలు పడిన కొన్ని చెరువుల కట్టలకు అధికారులు ఇసుక బస్తాలు వేశారు. గ్రామాలు, పట్టణాల్లో కొన్ని ఇండ్లు పూర్తిగా, మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. పలు గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరంగల్ జిల్లా నెక్కొండలో 24.63 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదవగా, ఆ తర్వాతి స్థానాల్లో పర్వతగిరి (23.48 సెం.మీ.), రెడ్లవాడ (18.3 సెం.మీ.), కల్లెడ (15.9 సెం.మీ.) ఉన్నాయి. వీటితోపాటు, వరంగల్ మరియు హన్మకొండ పట్టణాలలో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లపై వరద నీరు చేరింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఆహార పానీయాలు అందించాయి. అదనంగా వరంగల్లోని ఎన్‌టీఆర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, సాయి నగర్ కాలనీ వంటి ప్రాంతాల నుండి బాధితులను రక్షించడానికి సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.

నిలిచిన రైళ్లు..

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన రైల్వే మార్గాలు, స్టేషన్లు జలమయమయ్యాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి డోర్నకల్ రైల్వే జంక్షన్ వద్ద రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 5 గంటల పాటు కురిసిన వర్షానికి వరద నీరు రైల్వే స్టేషన్‌లోకి భారీగా చేరింది. డోర్నకల్ జంక్షన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి కూడా నీరు చేరింది. రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోవడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను జిల్లా పరిధిలోనే నిలిపివేశారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్, ఒక గూడ్స్ రైలును డోర్నకల్ జంక్షన్‌లో నిలిపివేశారు. గోల్కొండ రైలులో 220 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గుండ్రాతి మడుగు వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సైతం నిలిపివేశారు. మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయగా, గార్ల సమీపంలో మరో గూడ్స్ రైలును నిలిపివేశారు. విజయవాడ నుంచి వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఖమ్మం జిల్లా పరిధిలోనే నిలిపివేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img