శ్రీ వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన గంగాడి కృష్ణారెడ్డి.
ఆత్మహత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి.
కాకతీయ,హుజురాబాద్ : వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని శ్రీ వర్షిత కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. ఆయనతో పాటు జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వర్షిత కుటుంబ సభ్యులను ఓదార్చిన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బీజేపీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహార లోపం, ఫుడ్‌పాయిజన్ ఘటనలు సాధారణమైపోయాయని తీవ్రంగా మండిపడ్డారు.సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖను చూసుకుంటూ కూడా ప్రభుత్వ బడుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం మెలకువతో మెలిగి సర్కార్ బడులు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మండల అధ్యక్షులు రాముల కొమురయ్య, పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, ప్రధాన కార్యదర్శులు మోడెపు వినయ్, పారిపెల్లి కొండాల్‌రెడ్డి,ఉపాధ్యక్షుడు మర్రి రవీందర్, కార్యదర్శి చిదురాల శ్రీనివాస్‌రెడ్డి, యువమోర్చా అధ్యక్షుడు నరెడ్ల చైతన్యరెడ్డి, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బండారి లావణ్య, మీడియా కన్వీనర్ మూదం మధు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగిశెట్టి ప్రభాకర్, రాంపూర్ బూత్ అధ్యక్షుడు మంతెన వరదేశ్వర్, గాలీబ్ కుమార్, బద్దం రాజీ రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



