గుండ్రాతి మడుగు చెరువులోకి ఉదృతంగా వరద నీరు
కట్టకు నీటి బుంగలు
కట్టకు పొంచి ఉన్న ముప్పు
కాకతీయ మహబూబాద్ ప్రతినిధి : మహబూబాద్ జిల్లాలో కోరి మండలంలోని గుండ్రాతి మడుగు గ్రామ సమీపంలో చెరువు కట్టకు రెండు బుంగలు పడి నీరు బయటకు వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు. మొంథో తుఫాన్ కారణంగా బయట నుండి వరద నీరు చెరువులోకి ఉదృతంగా ప్రవహించడంతో చెరువు కట్టకు బుంగలు పడినట్లు సమాచారం. చెరువులోనికి చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ఈ విషయాన్ని గమనించి కాకతీయకు సమాచారం అందించారు. అధికారులు చెరువు కట్ట ప్రమాదం పట్ల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా వారు కోరారు.చెరువు కట్టతెగి ప్రమాదం ఏర్పడితే చెరువు కింద సాగు పొలాలు వరద నీటిలో కొట్టుకపోయి తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై కొరివి తహశీల్దార్ బి.విజయను వివరణ కోరగా వారు స్పందించలేదు


