కాకతీయ, వరంగల్ సిటీ : రంగశాయి పేట నాయుడు పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరుగగా లక్ష్మణ్ రావు (45) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన చేసుకుంది. మామునూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం ఖిలా వరంగల్ రుద్రమంబ నగర్ కు చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై నాయుడు పెట్రోల్ బంక్ సమీపాన యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించిన్నట్లు తెలిపారు.


