- పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, నడికూడ : నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకేపీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు. కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. ఏ గ్రేడ్‌కు రూ. 2389, కామన్ రకానికి రూ.2369ధర చెల్లిస్తుందని స్పష్టం చేశారు. సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17 శాతం తేమతో కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి అమ్ముకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


