కాకతీయ సినిమా: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న లేటెస్ట్ పాన్-ఇండియా మాస్ ఎంటర్టైనర్ ` పెద్ది`. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీని షాక్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అవైటెడ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే భారీ అంచనాలతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా కొత్త టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్‌లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా యాక్టివ్‌గా ఇన్‌వాల్వ్ అయ్యారట. ఇప్పటికే నిర్మాతగా ఆయన సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనా సుకుమార్ స్పెషల్ అటెన్షన్ చూపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
సినిమాకు మరింత ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఆయనే స్వయంగా కొన్ని రిపేర్స్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల చర్చ నడుస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ… సుకుమార్ పేరు వినిపించడం వలన సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. కాగా, పెద్ది సినిమాను 2026 సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శివ రాజ్ కుమార్, సాయి కుమార్, జగపతిబాబు లాంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


