- జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు
కాకతీయ, ఖిలావరంగల్ : మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణీకులు, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల సామాన్లను జాగిలాల సాయంతో శోధించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగం కనిపిస్తే వెంటనే పోలీసులను సమాచారమివ్వాలని ఇన్‌స్పెక్టర్ సతీష్ ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో ఆర్‌ఐ శివ కేశవులు, ఆర్‌ఎస్‌ఐ పూర్ణ, మనోజ్, నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.


