హుజురాబాద్‌లో పోలీసుల సైకిల్ ర్యాలీ.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం.
కాకతీయ ,హుజురాబాద్: హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజపల్లి వరకు వెళ్లి తిరిగి స్టేషన్ వద్ద ముగిసింది.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈనెల 30న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని, పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొని రక్తదానం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయడం ద్వారా పోలీసు అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐ కరుణాకర్, రూరల్ సిఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐ రామకృష్ణ, సిఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు యూనస్ అహ్మద్ అలీ, తిరుపతి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



