- నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ఏబీ వేడుకల మందిరంలో మద్యం దుకాణాల టెండర్ డ్రా ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 61 దుకాణాలు ఉన్నాయని, సెప్టెంబర్ 26న టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టామని, దరఖాస్తులు ఈ నెల 23 వరకు స్వీకరించామని తెలిపారు. మొత్తం దరఖాస్తులు 1800 వచ్చాయని, డిసెంబర్ 1 నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించాలని, ఈ టెండర్ గడువు 2025 నుండి 2027వరకు ఉంటుదని తెలిపారు. షాపులకు సంబంధించిన లైసెన్స్ ఫీజు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్ కుమార్, ఎక్సైజ్ సీఐలు చిరంజీవి, నాగేశ్వర్ రావు, బిక్షపతి, అశోక్, ఎస్ ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


