కాకతీయ, రామకృష్ణాపూర్ : విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి,పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ సూచించారు. సోమవారం స్థానిక గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


