- మంత్రి సీతక్క
- కాకతీయ, ములుగు ప్రతినిధి : జిల్లాకేంద్రంలోని మాధవరావు పల్లి గ్రామంలో రూ.2.30 కోట్ల నిధులతో నిర్మించిన కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయం తరగతి గదులు, ప్రయోగశాలలను కలెక్టర్ దివాకర్ టీఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో బాలికలకు విద్య అవసరం లేదనే సనాత ధర్మం పాటిస్తూ వంటగదిలకే పరిమితం చేశారని, నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని అన్నారు. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలని ఉద్దేశంతో మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబా గాంధీ పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ ఇంజనీర్ అరుణ్ కుమార్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


