కాకతీయ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నూతన ఎంపీడీవోగా ఏలూరి అంజలి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం నర్సింహులపేటకు ఆమెను నియమించింది. కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెడతానని ఆమె తెలిపారు.


