కాకతీయ, బయ్యారం : ఎర్రబోలు దీపిక సోమవారం బయ్యారం ఎంపీడీవోగా బాధ్యతలు తీసుకున్నారు. గ్రూప్ 1లో 682 స్టేట్ ర్యాంకు సాధించి, ఎంపీడీవో ఉద్యోగం పొందడంతో శిక్షణ పూర్తి చేసుకొని బయ్యారం ఎంపీడీవో గా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉత్తర్వుల మేరకు బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఆమె స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామం అని తెలిపారు.


