కాకతీయ, నెల్లికుదురు: కార్తీక మాసం సందర్భంగా మండలంలోని శ్రీశివపార్వతి భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో అర్చకులు వెలుకూచి నాగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి నాగయ్య శాస్త్రి మాట్లాడుతూ నవంబర్ 2న సామూహిక సత్యనారాయణ వ్రతాలు, 5న ఉదయం సామూహిక అభిషేకాలు, సాయంత్రం ఐదున్నరకు కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవ కార్యక్రమం, 14న ఉదయం 9 గంటలకు శుక్రవారం మహిళ భక్తులతో సామూహిక కుంకుమార్చన జరుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేముల సుధాకర్, డాక్టర్ రమణయ్య, గుండా రాజేందర్, పాము ఉపేందర్, వేముల శ్రీనివాస్ పాము రామ నరసయ్య, బేతు ఎల్లయ్య, బేతు విజయ్, కుమార్, వేన్నాకుల ఉపేందర్, మహేష్, తంబిరేలి సుధాకర్, గడ్డం యాలాద్రమ్మ, సులోచన, సరస్వతి, సరోజన భక్తులు పాల్గొన్నారు.
భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా అభిషేకాలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


