epaper
Saturday, November 15, 2025
epaper

బీఆర్‌ఎస్ ప్రగతి వర్సెస్ కాంగ్రెస్ మోసాల పాలన

బీఆర్‌ఎస్ ప్రగతి వర్సెస్ కాంగ్రెస్ మోసాల పాలన
ఇవి చూసి జూబ్లీహిల్స్‌లో ఓట‌ర్లు మ‌ద్ద‌తివ్వాలి
రెండేళ్లుగా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది
మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య లోపాయి కారీ ఒప్పందం
తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం న‌డుస్తోంది
బీజేపీతో పని చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి
బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, బుల్డోజర్ పాలన నడుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని షేక్పేట డివిజన్ రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటుచేసిన సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

బీజేపీ-కాంగ్రెస్ ల మధ్య బంధం

“తెలంగాణలో రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు అంతా బీజేపీతో కలిసిపోయారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తుంది. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీ టీం అంటున్నాయి,” అని కేటీఆర్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించే రాహుల్ గాంధీకి తెలంగాణలో అదే బుల్డోజర్ పాలన కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. “తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. పేదల ఇళ్లపై బుల్డోజర్ పెడుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదు. రాహుల్ గాంధీ సొంత ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని పొగుడుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్న మౌనంగా ఉంటున్నాడు,” అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లును చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అనే విషయం రాహుల్ గాంధీకి తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు.

 

 

 

 

మేం అభివృద్ధి చూస్తే.. కాంగ్రెస్ కూలుస్తోంది

ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాం.. నిర్మాణాత్మ‌క అభివృద్ధి చేప‌డితే ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన రేవంత్ స‌ర్కారు దుర్మార్గంగా నిట్ట‌నిలువునా కూల్చేస్తోంద‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. “ఒక్క సంవత్సరంలోనే అపార్ట్‌మెంట్‌ల నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో జనరేటర్లు, ఇన్వర్టర్ల పరిస్థితి లేకుండా నిరంతర విద్యుత్ అందించగలిగాము. హైదరాబాద్ నగర ప్రగతి, శాంతి భద్రతలపై అనుమానాలు ఉన్నవాటన్నిటిని తొలగించి అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దాము. శాంతియుతంగా, సోదరభావంతో ప్రతి ఒక్కరూ కలిసి ఉండే విశ్వ నగరాన్ని తయారు చేసే దిశగా విజయం సాధించాము. మత రాజకీయాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేశాము,” అని తెలిపారు. కేసీఆర్ గారి హయంలో మైనార్టీల కోసం 204 గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా సహాయం కింద ప్రత్యేకంగా రూ. 20 లక్షల స్కాలర్‌షిప్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా విజయవంతంగా వెళ్తున్నారని కేటీఆర్ వివరించారు.

మాయమాటలతో కాంగ్రెస్ మోసం

అడ్డగోలు హామీలు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “చదువుకున్న విద్యావంతులు పోలింగ్ రోజు బయటకు వచ్చి సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. రైతు నుండి విద్యార్థి వరకు, మహిళ నుండి ఉద్యోగి వరకు—ఎవ్వరికీ న్యాయం చేయలేదు.సమాజంలోని ప్రతి వర్గం కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాన్ని గుర్తించింది” అని ఆయన అన్నారు. మా పార్టీ 10 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, వారు చేసిన ఎన్నికల హామీల అమలు ద్రోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం రాజ‌ధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ...

తెలంగాణ నీ అయ్య జాగీరా ?

తెలంగాణ నీ అయ్య జాగీరా ? రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది అందుకే...

గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు

గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య...

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా?

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా? ఎగిరెగిరిపడితే ప్రజలు వాత పెడ్త‌రు నీ ప్రభుత్వమే ఆగమయ్యే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img