epaper
Sunday, March 1, 2026
epaper

మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం

ఇండియా విన్‌..!
మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం
ఆస్ట్రేలియాను కంగారెత్తించినా భార‌త బౌల‌ర్లు
త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి.. బ్యాటింగ్‌లో స‌త్తా చాటినా రో-కో
ఫాంలోకి కోహ్లి.. రికార్డుల మోత మోగించిన రోహిత్‌
సిరీస్ పోయినా.. మూడో వ‌న్డేలో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన భార‌త్‌

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. చివరి వన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో వ‌న్డేలో కంగారూలు నిర్ధేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 38.2 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. విరాట్ కోహ్లీ (74 నాటౌట్) తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టు విజయానికి స‌హ‌క‌రించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను గెలుచుకోకపోయినా, చివరి మ్యాచ్‌లో ప్రతిష్ఠను నిలబెట్టుకున్న‌ట్ల‌యింది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చూపించింది. దీంతో కంగారు టీమ్ భారత్‌ పై ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్ స్వీప్ రికార్డును మరోసారి అందుకోలేకపోయింది. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది.

ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ జాగ్రత్తగా ఆరంభించారు. అయితే 61 పరుగుల వద్ద హెడ్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత స్పిన్నర్లు ఆధిపత్యం చూపించారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రన్స్ రాకుండా అడ్డుకున్నారు. అక్షర్ పటేల్, మార్ష్‌ను 49 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. క్యారీ, రెన్షా త్వరగా వెనుదిరగడంతో 183/3 నుంచి 195/5కి పడిపోయింది. హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 4 వికెట్లు తీశాడు. నాథన్ ఎలిస్, మిచెల్ స్టార్క్ సహా టెయిలెండర్లను ఔట్ చేస్తూ ఆస్ట్రేలియాను 46.3 ఓవర్లలో 236 పరుగులకు పరిమితం చేశాడు. ఆసీస్‌ బ్యాటర్లలో మ్యాట్‌ రెన్‌షా (56), మిచెల్‌ మార్ష్‌ (41) రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2.. సిరాజ్, కుల్‌దీప్‌, అక్షర్, ప్రసిద్ధ్‌ కృష్ణ తలో వికెట్ తీశారు.

స‌త్తా చాటిన రో-కో..!

అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు శుభారంభం దక్కింది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ తొలి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో గిల్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా డకౌట్‌ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం తన స‌త్తా చాటాడు. కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో కుమార సంగక్కర రికార్డును దాటి, వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని ముందు ఇప్పుడు సచిన్ టెండుల్కర్ మాత్రమే ఉన్నాడు. రోహిత్ శర్మ 125 బంతుల్లో 121* పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో తన 33వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇద్దరి మధ్య 168 పరుగుల అజేయ భాగస్వామ్యం భారత్ విజయంలో కీలకం అయ్యింది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా అందుకే క్రికెట్‌కు గుడ్ బై...

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img