కాకతీయ, సినిమా, 2025 అక్టోబర్ 25: గత రెండు దశాబ్దాలుగా తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ యాక్టర్ గా టర్న్ తీసుకోబోతున్నాడు. ` ఎల్లమ్మ` మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ` బలగం` ఫేమ్ వేణు యెల్డండి ఈ సినిమాకు దర్శకుడు కాగా.. దిల్ రాజు నిర్మాత. నాని, నితిన్ వంటి హీరోల నుంచి చేజారిన ఎల్లమ్మ ఫైనల్‌గా దేవి శ్రీ చెంతకు చేరింది. తెలంగాణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా ఇది.
ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ` ఎల్లమ్మ` త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అయితే ఈ మూవీ కోసం దేవి శ్రీ డబుల్ రోల్ పోషించబోతున్నాడట. హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా డీఎస్పీ వర్క్ చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. నిజానికి మొదట ఈ సినిమా కోసం అజయ్-అతుల్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఫిక్స్ చేశారు. వారి చేత కొన్ని కంపోజిషన్స్ కూడా రెడీ చేయించారట.
అయితే దేవి శ్రీ ప్రసాద్ ఎంట్రీతో అజయ్ అతుల్ తో మాట్లాడి వాళ్లని తప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. మ్యూజిక్ బాధ్యతలు కూడా డీఎస్పీకే అప్పగించాలని దిల్ రాజు ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తాను హీరోగా పరిచయం అవుతున్న సినిమా కాబట్టి మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రాణం పెట్టేస్తాడు అనడంలో సందేహం లేదు. పైగా డబుల్ రోల్ పోషిస్తుంనందున డబుల్ రెమ్యునరేషన్ అందుకునే అవకాశం కూడా ఉంది.


