కాకతీయ, స్పోర్ట్స్, 2025 అక్టోబర్ 25: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి వైట్‌వాష్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి పోరు శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. అయితే సిరీస్‌ను కోల్పోవడంతో ఓ వైపు మైదానంలో ఓటమి నిరాశ వాతావరణం నెలకొనగా, మరో వైపు కొంతమంది యువ క్రికెటర్లు మాత్రం షికార్లలో మునిగిపోయారు.
అడిలైడ్‌లో జరుగుతున్న సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫ్రీ టైమ్‌లో బయటకు వెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురు ఆటగాళ్లు కలిసి స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని అడిలైడ్ సిటీలో షికార్లు చేశారు. కారులోని డాష్‌క్యామ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ప్రసిద్ధ్ కృష్ణ డ్రైవర్ పక్క సీటులో కూర్చుని ఉండగా, యశస్వి జైస్వాల్, జురెల్ వెనుక సీట్లలో కనిపించారు. మొదట తన కస్టమర్లను చూసి ఆశ్చర్యానికి గురైన డ్రైవర్.. తర్వాత ప్రయాణం మొత్తం సైలెంట్‌గా డ్రైవ్ చేశాడు. వీరు సిటీలో చక్కర్లు కొడుతూ షాపింగ్ కూడా చేసినట్లు సమాచారం.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్రికెట్ అభిమానుల్లో హీట్ క్రియేట్ చేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు. “ ఓపక్క వరుస ఓటముల కారణంగా టీమిండియా ఫారమ్‌పై చర్చలు నడుస్తుంటే.. మరోవైపు యువ ఆటగాళ్లకు షికార్ల అవసరమా?“ అని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం “క్రీడాకారులకూ రిలాక్సేషన్ అవసరమే” అంటూ సమర్థిస్తున్నారు.
ఇక క్రికెట్ పరంగా మాట్లాడితే, ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి అంత సజావుగా లేదు. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడం, బౌలింగ్‌లో లోపాలు కారణంగా సిరీస్ టీమిండియా చేతులెదురుగా జారిపోయింది. చివరి వన్డేలో అయినా జట్టు పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సిరీస్ అనంతరం టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అదేవిధంగా డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ స్టార్ట్ కాబోతోంది.


