కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన కొత్త ఎల్లయ్య, సమత దంపతుల కుమార్తె లావణ్య తెలంగాణ అండర్ 19 థైక్వాండో 40 కేజీల విభాగంలో జాతీయ జట్టులోకి ఎంపికయింది. వచ్చే నెలలో జమ్మూకాశ్మీర్ లో జరగబోయే నేషనల్ గేమ్స్ లో పాల్గొననున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. మారుమూల గ్రామం నుంచి నేషనల్ టీమ్‌కు ఎంపిక కావడం పట్ల కౌసల్యదేవిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


