- తీరనున్న న్యాయసేవల ఇబ్బందులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో న్యాయస్థానం ఏర్పాటు కోసం స్థానిక న్యాయవాదులు సమర్పించిన వినతిపత్రాన్ని హైకోర్టు పరిశీలించి, తగిన ఏర్పాట్లను చూడవలసిందిగా జిల్లా న్యాయస్థానానికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ కే. గోపీనాథ్ కేశవపట్నంలోని నాలుగు భవనాలను పరిశీలించమని ఆదేశించారు. ఈ మేరకు శనివారం కేశవపట్నంలో బిల్డింగ్‌లను పరిశీలించారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ హుజురాబాద్ వారు భవనాన్ని ఫైనల్ చేసి, ఈ నెల 31లోపు రిపోర్టును సమర్పించనున్నారు. కార్యక్రమంలో శంకరపట్నం న్యాయవాదులు బొంగోని హరికృష్ణ గౌడ్, కనకం దేవయ్య, షబానా, కోరిమి నరసింహస్వామి, అనిల్ కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, బీసీ మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్, నాయకులు హుసాముద్దీన్, షారుఖ్, సామాజిక కార్యకర్త సనత్ జయసూర్య, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


