epaper
Saturday, November 15, 2025
epaper

దూరం ద‌గ్గ‌రైంది!.. దొంతికి రేవంత్‌కు మ‌ధ్య‌ స‌యోధ్య‌

దూరం ద‌గ్గ‌రైంది!
దొంతికి రేవంత్‌కు మ‌ధ్య‌ స‌యోధ్య‌
న‌ర్సంపేట ఎమ్మెల్యేకు పార్టీలో, ప్ర‌భుత్వంలో పెద్ద‌పీట‌
వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయంపై సీఎం ఫోక‌స్‌
డీసీసీ అధ్య‌క్షుడి నియామ‌కానికి దొంతి ప్ర‌తిపాద‌న‌లు
సీఎం సానుకూల స్పంద‌న‌.. వ‌ర్ధ‌న్న‌పేట నేత పేరు ప్ర‌స్తావ‌న‌!!
కొండా సురేఖ త‌న‌య సుస్మిత‌ వ్యాఖ్య‌ల త‌ర్వాత ఆస‌క్తిక‌ర ప‌రిణామం
కూల్‌గా మొద‌లైన‌ రాజ‌కీయ వేఢీ

కాక‌తీయ‌, న‌ర్సంపేట‌/ వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : కాంగ్రెస్‌లో మాస్ లీడ‌ర్‌గా పేరొందిన న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డినిపార్టీలో, ప్ర‌భుత్వంలో క్రియాశీల‌కంగా మార్చేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దొంతి మాధ‌వ‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో అంటీ ముట్ట‌నట్లుగా ఉంటూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల దొంతి మాధ‌వ‌రెడ్డి మాతృమూర్తి కాంత‌మ్మ ద‌శ దిన క‌ర్మ రోజున సీఎం రేవంత్ రెడ్డి కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం.. ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తొల‌గిపోయిన‌ట్లయింది. శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి చాంబ‌ర్‌లో ఉన్న దొంతి మాధ‌వ‌రెడ్డి ఫొటోలు ఇందుకు బ‌లాన్ని చేకూర్చిన‌ట్ల‌యింది. దొంతి మాధ‌వ‌రెడ్డి సీఎంతో ఉన్న ఫొటోల‌పై ఇప్పుడు విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.

దొంతి మాధ‌వ‌రెడ్డి మాతృమూర్తి కాంత‌మ్మ ద‌శ దిన క‌ర్మ కార్య‌క్ర‌మంలో  రేవంత్ రెడ్డి

కొండా సురేఖ ఎపిసోడ్ త‌ర్వాత‌..ఆస‌క్తిక‌ర ప‌రిణామం..!

డెక్క‌న్ సిమెంట్స్ కంపెనీ ప్ర‌తినిధుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ప‌నిచేసిన సుమంత్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్‌గా తీసుకుని సుమంత్‌ను విధుల నుంచి త‌ప్పించేందుకు ఆదేశాలిచ్చారు. ఆ త‌ర్వాత సుమంత్‌ను అరెస్టు చేసేందుకు మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్ల‌డంతో రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల తీరును త‌ప్పుబ‌డుతూ మంత్రి త‌న‌య‌ సుస్మిత ప‌టేల్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈక్ర‌మంలోనే రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లు త‌మ‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని పేర్కొంటూ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆయ‌న త‌మ్ముళ్ల‌పైనా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి వంటి నేత‌లు త‌మ‌పై కుట్ర‌లు చేస్తున్నారంటూ తీవ్ర‌స్థాయి ఆరోప‌ణ‌లు చేశారు.ఈ ప‌రిణామం త‌ర్వాత సురేఖను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగింది. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఏఐసీసీ నేత మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క చొర‌వ‌తో ప‌రిస్థితి స‌ర్దుబాటైన‌ట్లుగా తెలుస్తోంది.

శుక్ర‌వారం సీఎం చాంబ‌ర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నారా రోహిత్ వివాహా ఆహ్వాన దిన‌ప‌త్రిక అంద‌జేస్తున్న చిత్రంలో దొంత‌మాధ‌వ‌రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు

టీ క‌ప్పులో తుఫానే.. కానీ.. కూల్‌గా ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారా..?

కొండా సురేఖ త‌న‌య సుస్మిత ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై చేసిన తీవ్ర ఆరోప‌ణ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అధిష్ఠానం ఆదేశాలు.. సుస్మిత చేసిన ఆరోప‌ణ‌ల అంశంపై సీరియ‌స్‌గా స్పందిస్తే.. ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాలు అందించిన‌ట్ల‌మ‌వుతోంద‌నే యోచ‌న‌తోనే సీఎం కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా పార్టీ ముఖ్య నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా…ఇటీవ‌ల జ‌రిగిన కేబినేట్ మీటింగ్ అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై త‌న కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్య‌ల‌కు తాను స్వ‌యంగా క్ష‌మాప‌ణ కోరుతున్న‌ట్లుగా చెప్పారు. ఇక ఈ విష‌యం ఇంత‌టితో ముగిసిపోయింద‌న్న‌ట్లుగా..టీ క‌ప్పులో తుఫాను అన్న టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య‌ల‌ను నిజమేన‌న్న‌ట్లుగా కాంగ్రెస్ అధిష్ఠానం సెండాఫ్ ఇచ్చేసింది. ప్ర‌స్తుతానికి ఈ వ్య‌వ‌హారం పైకి చల్ల‌బ‌డిన‌ట్లుగా క‌నిపించినా..లోలోన మాత్రం ర‌గులుతూనే ఉన్న‌ట్లుగా నేత‌ల వైఖ‌రి స్ప‌ష్టం చేస్తోంది. రాజ‌కీయాల్లో అదును చూసి..చ‌ర్య‌లు తీసుకోవ‌డం.. వేటు వేయ‌డం.. దెబ్బ‌కొట్టడం.. ఒంట‌రిని చేయ‌డం వైఖ‌రిలుంటాయ‌ని సీనియ‌ర్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఈ విష‌యంలో కొండా దంప‌తుల‌పై కూల్‌గా ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టార‌నే చ‌ర్చ కూడా కాసింత గ‌ట్టిగానే న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం.

వ‌రంగ‌ల్ డీసీసీతోనే మొద‌లా..! దొంతికి సీఎం మ‌ర్యాద‌..!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ డీసీసీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న నేత‌గా, వ‌రంగ‌ల్ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక శైలిని, అనుచ‌ర‌గ‌ణాన్ని క‌లిగిన మాస్ లీడ‌ర్‌గా ఉన్న దొంతి మాధ‌వ‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలోని విబేధాలను ప‌క్క‌న పెట్టి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా దొంతిని కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్ చేయాల‌ని యోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే వ‌రంగ‌ల్‌ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ బాధ్య‌త‌ల్లో ఆయ‌న అనుచ‌ర వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చేలా పావులు క‌దుపుతున్న‌ట్లుగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లానికి చెందిన ఓ నేత‌కు డీసీసీ ప‌ద‌వి ఇవ్వాల‌ని దొంతి కోరిన‌ట్లుగా, దానికి సీఎం సానుకూలంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రోవైపు డీసీసీ అధ్యక్ష ప‌ద‌వి కోసం కొండా అనుచ‌రుల‌తో పాటు మ‌రికొంత‌మంది సీనియ‌ర్లు కూడా ఆశిస్తున్నారు. ఈనేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి-దొంతిల మ‌ధ్య కుదిరిన రాజ‌కీయం..ఎలాంటి నిర్ణ‌యాల‌కు దారితీస్తుందో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం రాజ‌ధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ...

తెలంగాణ నీ అయ్య జాగీరా ?

తెలంగాణ నీ అయ్య జాగీరా ? రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది అందుకే...

గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు

గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య...

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా?

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా? ఎగిరెగిరిపడితే ప్రజలు వాత పెడ్త‌రు నీ ప్రభుత్వమే ఆగమయ్యే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img