మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్లు విడుదల
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని మునిసిపాలిటీలకు రూ.2,780 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2432 పనులకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపడంతో శుక్రవారం రాత్రి నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేఉసింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించింది.
కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పించింది. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


