epaper
Monday, March 2, 2026
epaper

‘అగ్రవర్ణ పార్టీల’ కోటను బద్దలు కొడుదాం

  • బహుజన రాజ్యం స్థాపన దిశగా టీఆర్పీ
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనే ధ్యేయం
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్

కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణలో అగ్రవర్ణ పార్టీల కోటను బద్దలు కొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కట్టుబడి ఉందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ ప్రకటించారు. వరంగల్‌ లో శుక్రవారం జరిగిన టీఆర్పీ జిల్లాల కన్వీనర్, కో కన్వీనర్, నియోజకవర్గ కన్వీనర్ల నియామకం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లు బీసీల పేరుతో ఓట్లు సేకరించి అగ్రవర్ణాల పక్షాన నిలిచిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుకు తెస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రాజకీయ రంగం మాత్రమే కాదు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల వరకు రిజర్వేషన్ అమలుకు టీఆర్పీ కట్టుబడి ఉంది అని అన్నారు. తమ వర్గాల ప్రజలందరినీ ఐక్యం చేసి బహుజనుల రాజ్యాన్ని తెలంగాణలో నెలకొల్పుతాం. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత బలంగా కొనసాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోకపోతే వారికి తెలంగాణలో రాజకీయ సమాధి తప్పదని అన్నారు. రాబోయే 100 రోజుల్లో బహుజనుల డంక తెలంగాణ అంతటా మోగబోతోందని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి నాయకుల నియామకంపై సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ నిర్వహించామన్నారు. ‘మేమెంతో – మాకు అంత’ అనే నినాదంతో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా ఎగురవేసి బహుజన ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తామని తీర్మానించారు. ఈ సమావేశం రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఉమ్మడి వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img