ఆదిలాబాద్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్
కాకతీయ ఆదిలాబాద్ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం హెడ్ క్వార్టర్స్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీసు డిపార్ట్‌మెంట్ విధులు, ఆయుధాల వినియోగం, నిర్వహణ, శాంతి భద్రత సమయంలో పాటించాల్సిన అంశాలపై విద్యార్థులకు ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, పటన సీఐలు బి సునీల్, కె నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు టి మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ సిబ్బంది, ఫింగర్ ప్రింట్, కమ్యూనికేషన్, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


