సెంటర్ల’ను వేగిరంగా ఏర్పాటు చేయండి
నెల్లికుదురు మండల ప్రత్యేక అధికారి జనగు మరియన్న
కాకతీయ, నెల్లికుదురు : ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి జనగు మరియన్న అన్నారు. మండల కేంద్రం లోని రైతు వేదికలో గురువారం ధాన్యం సేకరణపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని, ధాన్యం సేకరణ కేంద్రాలలో తూకం, నాణ్యత పరీక్షలు పారదర్శకంగా జరగాలని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తక్షణమే చెల్లింపులు జరగేలా చూడాలని అన్నారు. మండలంలోని ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో 17 కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ చంద నరేష్ ఏ ఈ ఓ లు వల్లముల ప్రవీణ్ జిపిఓలు పిఎసిఎస్ సీఈవోలు ఐకెపి ఎపిఎం ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.


