గంజాయి విక్రయిస్తున్ననిందితుడి అరెస్ట్
కాకతీయ, గీసుగొండ: గంజాయి విక్రయిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై కె. కుమార్ సిబ్బందితో కలిసి ధర్మారం పరిసర ప్రాంతంలో పహారా నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే ఎస్ఐ కుమార్ తన సిబ్బందితో అతడిని పట్టుకొని విచారించగా నిందితుడి వద్ద ఎండు గంజాయి లభ్యమైంది. నిందితుడు బీహార్ నలంద జిల్లా,బెన్ మండలం,సెహరి గ్రామానికి చెందిన మోహన్ కుమార్ (20) అని తేలింది. 40 గ్రాముల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు సీఐ తెలిపారు.


