- ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులలో వేగం పెంచి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనుల్లో జాగ్రత్తలు వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను కలెక్టర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేడారం దేవాలయం అభివృద్ధి పనులను మాస్టర్ ప్లాన్ ప్రకారం గేట్ పిల్లర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. నాణ్యత లోపించకుండా స్టీల్, సిమెంట్ తో పుట్టింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, ఆర్ ఆండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, ఎండోమెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


