ఫౌజీ గా డార్లింగ్
అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది
బర్త్ డే విషేస్ చెబుతూ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్
కాకతీయ, సినిమా : హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా నిర్మాణమవుతున్న విషయం సినిమా ప్రేక్షకులకు తెలిసిందే. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న టైటిల్‌ను చిత్రబృందం నేడు ఖరారు చేసింది. ఈ చిత్రం పేరు ‘ఫౌజీ’ అని తెలుపుతూ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువు లేని ఏకలవ్యుడు.. పుట్టకతోనే అతడు ఓ యోధుడు.. మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ‘ఫౌజీ’’ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉంటోందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా ఇమాన్వీ నటిస్తున్నారు.
ప్రభాస్ ఫిలాసఫీ.. సింప్లిసిటీ.. మీరూ ఫాలో అవుతారా!
‘‘మీరు ఇంతవరకూ చూడని కథను చూపిస్తున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలను అయినా అది అందుకుంటుంది. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ‘సీతారామం’ తర్వాత దీనిని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్ ఫీలవుతారు’’ అంటూ హను రాఘవపూడి గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రం నిర్మాణానికి చకచక ఏర్పాట్లు జరుగుతుండటంతో ఈ చిత్రంపై అటు ట్రేడ్ వర్గాలు, ఇటు పాన్ ఇండియా ప్రేక్షక్షులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


