కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : చెన్నైకి చెందిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ “ది లాస్య ఆర్గనైజేషన్” ప్రతీ సంవత్సరం భారతీయ శాస్త్రీయ నృత్య కళారంగంలో విశిష్ఠ ప్రతిభ చూపిన కళాకారులను గుర్తిస్తోంది. వారికి ప్రతిష్ఠాత్మక వృంద్రాణి అవార్డు ను ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు భారతీయ నాట్య సంప్రదాయాలను నిలబెట్టేందుకు, ప్రపంచ వేదికలపై భారతీయ నాట్య ప్రాముఖ్యతను ప్రతిష్ఠించేందుకు సేవలందిస్తున్న కళాకారులను సత్కరించేందుకు ప్రతి ఏడాది అందజేయబడుతుంది. ఈ ఏడాది సీజన్–5లో, కూచిపూడి నృత్య విభాగంలో మహబూబాబాద్‌కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి, తాండవ కృష్ణ నృత్యాలయ డైరెక్టర్ నాట్యశ్రీ ఉదయశ్రీకి అవార్డు వరించిందని తెలిపారు. ఈ మేరకు ఈనెల 19న చెన్నైలోని చారిత్రాత్మక ఎగ్మోర్ ఆడిటోరియంలో ది లాస్య ఆర్గనైజేషన్ అధినేత రాజ్ మరియన్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకునట్లు తెలిపారు . అవార్డు స్వీకరించిన ఉదయశ్రీ ని పలువురు అభినందించి జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.
ఉదయశ్రీకి ప్రతిష్ఠాత్మక ‘వృంద్రాణి అవార్డు’
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


