- రోడ్డెక్కిన అన్నదాతలు
కాకతీయ, ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లా బోథ్ మండలకేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. సోయా పంటను 20 రోజుల నుండి మార్కెట్ యార్డ్ లో ఆరబెడుతున్నామని, యార్డు లో సోయా పంట నిల్వలు పేరుకుపోయాయని వాపోయారు. కనీసం మార్కెట్ యార్డ్ కు పంట తీసుకువద్దమన్నా కూడా స్థలం కూడా లేదని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందమన్నా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, రాత్రింబవళ్ళు మార్కెట్ యార్డులోనే వుండవలసి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సోయా పంట వెంటనే కొనుగోలు చేయాలని, అకాల వర్షాల వల్ల పంట దిగుబడి రాక నష్టపోయిన ప్రతీ రైతుకు రూ.10 వేల సహాయం తో పాటు, తమ ప్రాంతంలో పండిస్తున్న పంటలకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని అన్నారు. ధర్నాలో బోథ్ మండల రైతులు ఇట్టేడి మోహన్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్, కొట్టాల రమేష్ రెడ్డి , సోమ్ శంకర్, రాజారాం, చాంద్ బాషా, రైతు వేదిక అధ్యక్షుడు బొర్రన్న, శ్రీధర్ రెడ్డి, అల్లకొండ ప్రశాంత్, సోయాబీన్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


