- ఆభరణాలు అపహరణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో దీపావళి రోజున దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధీబాయ్ (65)ని మెగావత్ సవాయి సింగ్ అనే దుండగుడు గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకుని పారిపోయాడు. సీఐ తిరుపయ్య, ఎస్ఐ రాఘవేంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హంతకుడు స్థానికుడు కావడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


