- ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు భరోసా
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి కూసుమంచి మండలంలో పలు రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. నేలపట్ల, ధర్మతండా గ్రామాల్లో మొత్తం రూ.12 కోట్లకు పైగా రోడ్లు, సీసీ రోడ్లు, అంగన్వాడి, త్రాగునీటి పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల కోసం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, నేలపట్ల గ్రామానికి 18 ఇండ్లు కేటాయించామని తెలిపారు. అర్హులైన ప్రతీతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


