కాకతీయ బోథ్: బీఆర్ఎస్ పాలనలో ఆదివాసీలకు దండారి ఉత్సవానికి రూ.10 వేల చొప్పున చెక్కులు అందించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కులు ఇవ్వకపోవడం దారుణమని మాజీ ఎంపీపీ తుల. శ్రీనివాస్ అన్నారు. వజ్జర్ మహాదూగూడ, జైతుగూడ, టివిటి గ్రామాల ఆదివాసుల ఆహ్వానం మేరకు దండారి ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ పాల్గొని ఆదివాసీలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయానికి రైతు భరోసా, దండారి చెక్కులు ఇచ్చేవారని అప్పుడు ఆదివాసీలు సంతోషంగా ఉండేవారన్నారు. కార్యక్రమంలో బోథ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు ఇర్ల అభిలాష్, యల్ల సుధీర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్, మాజీ సర్పంచులు భగవాన్ దాస్, కిషన్, చిన్నయ్య, ప్రదీప్, సంజీవ్ రెడ్డి, సంతోష్ ఈశ్వర్, శుభం తుల అభిలాష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దండారి చెక్కులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


