కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎల్. రూప్ సింగ్, జిల్లా జాగృతి ఇంచార్జ్‌లకు పిలుపునిచ్చారు. కవిత నేతృత్వంలో రెండు రోజులపాటు జరిగే పర్యటనలో స్థానిక మేధావులు, కవులు, కళాకారులు, వ్యాపార వర్గాలు, కుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సమావేశమై సలహాలు, సూచనల ద్వారా తెలంగాణ జాగృతిని బలోపేతం చేయనున్నారు. రూప్ సింగ్ కరీంనగర్‌కు మొదటిసారి విచ్చేసిన సందర్భంగా జాగృతి నాయకులను సన్మానించారు. కవిత స్థానిక సమస్యలను అవగాహన చేసుకుని భవిష్యత్తులో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. సమావేశానికి జిల్లా జాగృతి అధ్యక్షులు హరిప్రసాద్ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ అంకం శివరాణి, ఆరోగ్య విభాగం కన్వీనర్ మేకల తిరుపతి, స్టూడెంట్ వింగ్ కన్వీనర్ ఎంఏ రజీ, జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్, రంగరావేణి లక్ష్మణ్, పొద్దిల్ల సదాసందం, తోగోటి తిరుపతి, సురేంద్రరెడ్డి, దయ్యాల ఓంప్రసాద్, సంగీతారెడ్డి, అపర్ణ, హుస్సేన్, గాలిపెళ్లి రత్నాకర, పూసల పవన్ తదితరులు పాల్గొన్నారు.


