కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బాసు తండా, బక్కతండ గ్రామాల్లో విత్తన శుద్ధిపై రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ మంగళవారం అవగాహన కల్పించారు. పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులకు భారత ప్రభుత్వం పత్తి కొనుగోలు కోసం నూతనంగా ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’ గురించి రైతులకు వివరించారు. రైతుల స్మార్ట్ ఫోన్లలో యాప్ ను ఇన్స్టాల్ చేయడం స్లాట్ బుకింగ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రావుల శ్రీను, రైతులు పాల్గొన్నారు.


