- సహకరించిన తల్లీ, చెల్లి !
- అనుమానాస్పద స్థితిలో కుమారుడి మృతి
- పంజాబ్‌లో ఘటన.. వెలుగులోకి సంచలన వీడియో..
- దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం
- నిందితులపై కేసు నమోదు
కాకతీయ , నేషనల్ డెస్క్ : పంజాబ్ మాజీ డీజీపీ, మాజీ మహిళా మంత్రి కుమారుడి అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. తన భార్యకు, తన తండ్రికి వివాహేతర సంబంధం ఉందని.. ఇందులో తన తల్లి, సోదరి కుట్ర ఉందని ఆ కుమారుడి పాత వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది. దీంతో అతని తల్లిదండ్రులు, సోదరి, భార్యపై హత్య కేసు నమోదు కాగా.. దీనిపై పంజాబ్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.
ఏం జరిగింది?
మరణించిన వ్యక్తి పేరు అఖిల్ (33). అతని తండ్రి పంజాబ్‌కు చెందిన మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా. అతని తల్లి పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు రజియా సుల్తానా. ఆమె గతంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. అయితే కొద్ది రోజుల క్రితం అఖిల్ పంచకులలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించారు. దీనితో అతనిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. మాదక ద్రవ్యాలను అధిక మోతాదులో తీసుకోవడం వల్లనే అఖిల్ మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు జరిపిన దర్యాప్తులో పలు దిగ్భ్రాంతికరమైమ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఖిల్ తండ్రి మహ్మద్ ముస్తఫాకు, అఖిల్ భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు కొన్ని వీడియో ఆధారాలు లభించాయి. స్వయంగా అఖిల్, అతని స్నేహితుడు రికార్డు చేసిన ఆ వీడియోల్లో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు ఉండడం గమనార్హం.
ఆ వీడియోల్లో ఏముంది?
ఆగస్టులో రికార్డు చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోలో, అఖిల్ తన తండ్రి, భార్యల మధ్య ఉన్న సంబంధం గురించి పలు విషయాలు చెప్పాడు. “నా భార్యకు, నాన్నతో సంబంధం ఉందని తెలుసుకున్నాను. ఇది నా మనస్సును గాయపరిచింది. నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. నా తల్లి, సోదరి కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నారు. నా వివాహానికి ముందే నా భార్య గురించి నా తండ్రికి తెలుసు. వారి మధ్య అప్పటికే సంబంధం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, వివాహం తరువాత మొదటి రోజు ఆమె నన్ను కనీసం తాకనివ్వలేదు. ఆమె నన్ను వివాహం చేసుకోలేదు. నా తండ్రిని వివాహం చేసుకున్నట్లు ప్రవర్తిస్తోంది. దీని గురించి ఇంట్లో అడిగితే నీవు భ్రమలో ఉన్నావని అన్నారు. నాకు పిచ్చి పట్టిందని చెప్పారు. అలాంటప్పుడు నన్ను మానసిక వైద్యుల దగ్గరకు పంపించాలి కదా. కానీ వారు అలా చేయలేదు. ఎందుకంటే నేను మానసికంగా బాగానే ఉన్నా. అసలు విషయం ఏమిటంటే, తమపై ఆరోపణలు చేస్తే నన్ను అత్యాచారం, హత్య కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు… అంటూ వీడియోలో మృతుడు తన ఆవేదన వ్యక్తంచేశాడు.


