కాకతీయ, గీసుగొండ : మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. స్వామివారికి అభిషేకం నిర్వహించే సమయంలో గర్భగుడిలోని నాగేంద్రుడి పుట్ట పైన, మూల విరాట్ పై సూర్యకిరణాలు ప్రసరించడంతో గర్భగుడి పసిడివర్ణంగా మారింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామి వారిని వైదిక మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక అభిషేకము పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అశ్వయుజ మాసం అమావాస్య రోజున అనగా దీపావళి నాడు సూర్యకిరణాలు స్వామి పై ప్రసరించడం ఎంతో విశేషమని తెలిపారు. స్వామివారిని జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు, కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వర్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడిని తాకిన సూర్య కిరణాలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


