- ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం
కాకతీయ, కరీంనగర్ : దీపావళి అంటే ఇంటింటా దీపాల కాంతులు, దేవాలయాల్లో పూజలు, పటాకుల శబ్దం. సాధారణంగా అందరూ దేవుళ్లను పూజిస్తూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తారు. కానీ కరీంనగర్ జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు మాత్రం తమ పూర్వీకులను స్మరించుకుంటారు. వారు శ్మశాన వాటికలకు వెళ్లి సమాధుల వద్ద దీపాలు వెలిగించి, పూజలు చేసి, టపాసులు కాల్చుతూ దీపావళి జరుపుకుంటారు. ఈ ఆచారం దాదాపు ఆరు దశాబ్దాలుగా వారు కొనసాగిస్తున్నారు.


