కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని రామచంద్రు తండా గ్రామానికి చెందిన జాటోత్ సక్రు (60) గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిగా చెందారు. కాగా, మంగళవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జాటోత్ వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ సోమని, తదితర నాయకులు మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కేజీల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ భోజ్యా అమర్శంగ్, వీరన్న, రాజా, జూమ్మి, జమాలపతీ, తదితరులు పాల్గొన్నారు.


