- ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : నీలం శంకరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరిడుతామని ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు. చిన్న గూడూరు మండల కేంద్రంలో ఎల్ హెచ్ పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో మంగళవారం ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ నీలం శంకరయ్య భూమి పై వచ్చి రాత్రి సమయంలో అక్రమంగా దుండగులు కూల్చితే, భాదితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి బాధితులపైనే పోలీసు అధికారులు కేసును నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసు అధికారులు సమగ్ర విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల న్యాయం గెలిచే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పీఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మంగిలాల్ నాయక్, జిల్లా నేతలు ధరంసౌత్ బాలు నాయక్, శ్రీను నాయక్, మండల నాయకులు తిరుపతి నాయక్, కండే శంకర్, నీలం కిషన్, బొల్లికొండ నరేష్, విజేందర్, రాము, గణేష్, వివిధ కుల సంఘ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


