కానిస్టేబుల్ హత్య కేసులో మలుపు..
నిందితుడు రియాజ్ మృతి..
కాకతీయ, తెలంగాణ బ్యూరో :
నిజామాబాద్‌లో సంచలన సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం సారంగాపూర్ సమీపంలో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌లో రియాజ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఈ క్రమంలో కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించగా, పోలీసులు స్వీయరక్షణలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రియాజ్‌ను వెంటనే నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న రియాజ్ ఈరోజు ఉదయం మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో నిజామాబాద్‌లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.


